పుట:మధుర గీతికలు.pdf/358

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రూ సు - సా లీఁ డు


స్వీయదేశము స్కాట్లండు స్వేచ్ఛ కొఱకు
తనదు జీవిత మెల్లను ధారవోసి
ఆంగ్ల సేనలఁ దలఁపడి ఆఱుమార్లు
పోరు గావించి జితుఁ డయ్యె బ్రూసురాజు.

తిరిగి రాజ్యము నెట్లో సాధించి తనదు
ప్రజల నెల్లర సంతోషపఱుప, నతఁడు
ఎన్నియెన్నియొ వ్యూహముల్ పన్నెఁ గాని
కార్యసాఫల్య మించుక గాంచఁ డయ్యె.

సొమ్మసిలి యాతఁ డూరూర దిమ్మదిరిగి
నిలిచి తలదాఁచికొన నింత నీడ లేక
కడకు నెట్టులొ యొక పాడుగుడిసెఁ జేరి
వెచ్చనూర్చుచు దినములు బుచ్చుచుండె.

51