పుట:మధుర గీతికలు.pdf/357

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు సేనాని కీరీతి నానతిచ్చి
డిగ్గు రని పీఠ ముననుండి డిగ్గె ఱేఁడు,
సభ్యు లెల్లరు లేచిరి సంభ్రమమున,
సిగ్గుచే నంత సేనాని శిరము వాల్చె.

*** *** *** *** *** ***

కొండయెలు కంచు దొంగలగండఁ డంచు
ఛత్రపతిఁ గూర్చి పాశ్చాత్యచరితకారు
లెన్నికల్లలు రచియించియున్న నేమి,
వాని నత్కీర్తి యొక్కింతయేని చెడెనె !

50