పుట:మధుర గీతికలు.pdf/356

ఈ పుట ఆమోదించబడ్డది


“చారు సుకుమార సుందరాకార యైన
యీమెకడుపున నే నుదయించియున్న
అహహ ! ఎంతటి ధన్యుఁడ నగుదునో కద"
యనుచు గద్గదవరమున ననియె ఱేఁడు.

అధిపుఁ డాడిన యా మాట లాలకించి
తెల్లవోయిరి సభలోని యెల్లవారు;
మేడచుట్టును నిలుచున్న మెలఁత లెల్ల
మేలు మే లని తలలూచి మెచ్చికొనిరి.

అదిగో ! ఎవ్వరొ శుభలక్షణాంగి యొక తే
రాజ్ఞి కాఁబోలు - సౌధాంతరముననుండి
ప్రణయదృష్టులతోఁ బాటు ప్రభునిమీఁద
కుసుమవర్షము కురిపించె కూర్మి మీఱ

"విలువనగలును సన్న దువ్వలువ లొసఁగి
వెంటనే యామెఁ దోడ్కొని యింటి కేగి,
బల్మిమై నామె బందెగాఁ బట్టికొనిన
నేరమునకు క్షమాపణ కోరి రమ్ము.”

49