పుట:మధుర గీతికలు.pdf/354

ఈ పుట ఆమోదించబడ్డది

శి వా జీ శీ ల ము


లగ్గపట్టి శివాజి కల్యాణికోట
ముట్టడించి పరాక్రమమున జయించి
సఖులు మంత్రులు పరివారజనులు తన్ను
గూడి సేవింప నొకనాడు కొలువు దీర్చె.

అరుణకిరణుడు చరమాద్రి నొరఁగుచుండె,
చిమ్మచీఁకటిచీర కుచ్చిళ్లు దిద్ది
పైఁట సవరించుకొనుచుండె ప్రకృతికాంత,
మెల్లఁగ నవ్వుచుండె జాబిల్లికొదమ.

సద్దు మణిఁగెను సభయెల్ల, గద్దెనుండి
యింక దిగలేదు భూవరుఁ, డెల్లజనులు
దృష్టి సారించి యెద్దియో దృశ్యముదెస
చూచుచుండిరి తద్దయు చోద్య మొప్ప.

47