పుట:మధుర గీతికలు.pdf/353

ఈ పుట ఆమోదించబడ్డది


తరతరంబులనుండి మీ తాతతండ్రు
లెల్లజనములు రంజిల్ల నేలుచున్న
పూజ్య మైనట్టి మేవాడురాజ్యలక్ష్మి
జోలి నా కేల ? మీరలే యేలికొనుఁడు

రిపుభయంకరమై దుర్నిరీక్ష్య మైన
నీదు వదనంబు వీక్షింప నేర నింక
దేవి ! భవదీయమూర్తి శాంతింపఁ జేసి
సుప్రసన్నవై నను దయఁ జూడు మమ్మ.

నెల వొసంగుము, పోయి వచ్చెదను తల్లి :
నిరుపమం బగు నీ శౌర్యనిధికి మెచ్చి
ఒక్క మేవాడే కాదు వేఱొక్క రాజ్య
మొసఁగెదను నీకు, గైకొను పసదనంబు

46