పుట:మధుర గీతికలు.pdf/352

ఈ పుట ఆమోదించబడ్డది


అనియు నీ వనుచుంటివి - అమ్మ నిజము,
దేవి! నీ చిత్తవృత్తిని తెలిసికొంటి,
మేటి మేవాడురాజ్యంబు మీదె సుమ్మి
నొక్కి ముమ్మాటి కే నిదే సుడువుచుంటి.

వలదు నా కింక నీ సార్వభౌముపదవి,
ఇదిగో, నా రాజ బిరుదంబు వదలుచుంటి,
తరుణులుసు గూడ నవిరళ త్యాగవహి.
నుఱుకుచుండఁగ నిం కెట్టు లోర్చువాఁడ ?

దురతిశయమున కన్నులు పొరలు గ్రమ్మ
పఱచితిని మిమ్ము నగచాట్టపాలు గాఁగ,
మానవతులైన మానినీ మణుల కెదుర
నిలిచి సమరంబు నే నింక సలుపఁ జాల.

తల్లి! భారతమహిళామతల్లు లిట్టి
దివ్య రణతంత్రభరితలు, దేశభక్తి
నిరత లంచును మున్నె నే నెఱిఁగియున్న
పాలువడుదునె యకట ! యీ పాడుపనికి?

45