పుట:మధుర గీతికలు.pdf/350

ఈ పుట ఆమోదించబడ్డది

అక్బరు నిర్వేదము


ఆమె యెవ్వరు ? కేలఁ జంద్రాయుధంబు
రాణ మెఱయఁగ పంచకల్యాణి నెక్కి
సమరభూమి విహారంబు సలుపుచుండె,
వీరరస మెల్ల మూర్తీభవించె ననఁగ

నెన్నుదుటఁ దూలి ముంగురుల్ నృత్యమాడఁ
చెక్కు దోయిని గ్రమ్మిన చెమ్మటలను
మాటిమాటికి కొనగోట మీటికొనుచు
దెసలఁ బరికించుచున్న యా తెఱవ యెవరు ?

ఆహవంబున రిపులపై మోహరించి
ఓహటిల్లక పోరాడి, యుర్వి నొరఁగి
యున్న తన సేనఁ దిలకించి యుస్సు రనుచు
వేడినిట్టూర్పు బుచ్చు నా చేడె యెవరు ?

43