పుట:మధుర గీతికలు.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

24

పంతులుగారి తర్వాత పంతులుగారంత సేవ చేసి, వారికంటె ఎక్కువ కష్టాలు పడడమే కాదు, ఒక రంగంలో కాదు, అన్ని రంగాల్లో, దేశ సేవలో, సాహిత్యసేవలో, సత్యాగ్రహోద్య మంలో, గ్రంథాలయ నిర్వహణంలో, ముఖ్యంగా వితంతూద్వాహ సంస్కారోద్యమంలో, బ్రహ్మ సమాజోద్యమంలో కఠోరమైన దీక్షతో, వజ్రసంకల్పంతో తనను తాను అంకితం చేసుకొని ఊహించలేనంతగా అన్ని విధాలా నష్టపడ్డాడు అదే కృష్ణరావు గారిలో ఉండే విశిష్టత : అని ప్రసంగించిన దాన్ని బట్టి చూస్తే నాళము కృష్ణరావుగారి విశిష్టవ్యక్తిత్వాన్ని గూర్చి కొద్దిగానైనా మనము ఊహించుకొనుటకు కొంతలో కొంత అవకాశము కలు గును. అంతేకాక దాకారపు అప్పారావుగారు రచించిన అఖిలభారత బ్రాహ్మ సమాజము” అనే గ్రంథంలో వీరి సంస్కారం చక్కగా ప్రశంసింపబడింది.


'అఖిలభారత బ్రాహ్మ సమాజము' అనే గ్రంథంలో గ్రంధ కర్త శ్రీ దాకారపు అప్పారావుగారు శ్రీ నాళం కృష్ణరావుగారిని ' అన్ని కోణముల నుండి పరిశీలించి వారివి గూర్చి వ్రాసిన అంశములీక్రింద ఉద్ధరింతబడినవి -


"శ్రీ నాళము కృష్ణరావుగారు విక్రమ సంవత్సరములో, సంక్రాంతి వెళ్లిన మరునాడు అనగా కనుమ పండుగనాడు జనన మందారు. ప్లవ ఉగాదినాడు. దివంగతులైనారు - ఆంధ్రులకు మిక్కిలి ప్రీతి పాత్రములైన, రెండు పండుగలతో వీరి జనన మరణాలు బంధింపబడినవి.