పుట:మధుర గీతికలు.pdf/347

ఈ పుట ఆమోదించబడ్డది



అనుడు, నవ్వుచు ఱేనితో ననియె కాఁపు :
“చెమట యూడ్చి దినం బెల్ల చేను దున్ని
కూడుగుడ్డకు నేమియు కొఱఁత లేక
జీవయాత్రను సాగింతు స్వేచ్ఛ మీఱ.

సతియు బిడ్డలు నా కనుసన్న మెలఁగి
పనులు గావింతు, రెన్నడు బదులు గొనను
పరులకడ పైస యైన, నెల్లరును నాకు
మిత్రులే కాని లేఁ డొక్క శత్రువైన.

కమ్మ తెమ్మెరబుడుత నా కమ్మతీఁడు
గౌతమీనది నా యూడిగంపుటింతి
పగలు రేయియుఁ బాయక ప్రకృతికాంత
నాకు పరిచర్య చేయుచు సాఁకుచుండు."

ఉస్సు రని రాజు పెద్ద నిట్టూర్పు పుచ్చి
పలికె నీరీతి నా కృషీవలునితోడ,
'నిజము నీ మాట లెల్లను నిక్కువములు
వెయ్యియేఁడులు వర్ధిల్లు మయ్య నీవు.'

40