పుట:మధుర గీతికలు.pdf/346

ఈ పుట ఆమోదించబడ్డది


"పరులపదవుల కెప్పుడు వాంఛ సేయ
పరులు నాదగు పదవికి వాంఛ గొనరు,
ఉన్నదానికి సంతుష్టి నొందువాఁడ
లేనిదానికి లేశంబు క్లేశ మొంద.”

వేఁట ముగియించి ఆ దారివెంట మరలి
తనదు పరివారజనులతోఁ జనుచు రాజు,
అతని పాటల నాలించి యట్టె నిలిచి
హయముపై నుండి వానితో సనియె నిట్లు:

'బాపురే ! ఏమి యంటివి కాఁపువాఁడ ?
నీదు వాక్యము నిక్కంబు గాదు సుమ్ము
ఈ జగం బెల్ల పాలించు రాజ నేను
నాకు లేని మనశ్శాంతి నీకుఁ గలదె?

జంకు గొంకును లేక నిశ్శంకముగను”
శ్రావ్య మగు నీదు మంజులస్వరముతోడ
హాయిగా పాట పాడెదు హాళికుండ!
చెవుమ యెటు కల్గి నీ కిట్టి చిత్తశాంతి?'

39