పుట:మధుర గీతికలు.pdf/345

ఈ పుట ఆమోదించబడ్డది

మ న శ్శాం తి


పావనం బగు గౌతమీపరిసరము న
అల్లిబిల్లిగ పూఁదీఁగ లల్లు కొనిన
రమ్యతలమున నొక కుటీరంబునందు
కాపురం బుండె నొక పేద కాఁపువాడు

కలఁత యెఱుఁగని వాని కన్గొలుకులండు
అనిశ మానందలక్ష్మి తా నధివసించు,
వలుద యగు వాని వక్షఃకవాటమందు
నిలిచి ఆరోగ్యదేవత. నృత్యమాడు

ఆతఁ డొకనాఁడు తనయింటి యరుగుమీఁద
పిల్లవాయువు మెల మెల్ల వీచుచుండ,
కొమురులును దాను భార్యయు కూరుచుండి
వేడు కలరఁగ నీరీతి పాడుచుండె

38