పుట:మధుర గీతికలు.pdf/344

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు వచియించి తోడనే యతఁడు తనదు
నుత్తరీయంబులో దాఁచి యుంచికొనిన
మణిమయం బగు మకుటంబు మౌళిఁ దాల్చి
వెనుకఁ జనుచుండె నాతండు గనకయుండ.

దారి వెంబడిఁ జనుచు, ప్రతాపరుద్ర
చక్రవర్తిని, గాంచి యాశ్చర్య మొంది. '
ప్రజలు మంత్రులు ప్రభువులు భటులు కాపు
లరిగి రాబాల గోపాల మధిపు వెంట.

రాజరాజులకు లభింపరాని యట్టి
వైభవంబున, ధారణీవల్లభుండు
ఊరుపేరును లేని యా యోధవరుని
యంత్యవిధులు యథావిధి నాచరించె

37