పుట:మధుర గీతికలు.pdf/343

ఈ పుట ఆమోదించబడ్డది


దానిఁ గనినంత పథికుండు "తల్లడంబు
నొంది యిట్లనె, ‘అన్న! నే నొక్కమాట
యడుగుచుంటిని, దయచేసి నుడువు మయ్య
శకటమున నీపు గొనిపోపు శవ మెవరిది ?'

'యుద్ధమునఁ బోరి మరణంబు నొందినట్టి
యొక్క నిఱుపేద సామాన్యయోధుఁ డితఁడు'
అనుచు నాతఁడు మాఱు మాట్లాడకుండ
తిరిగి చూడక తనదారి నరుగుచుండె.

"వేమి యంటివి ? ఆంధ్రుఁడా : ఏమి యంటి :
వొక్కనిఱుపేద సామాన్యయోధుఁ' డనియ ?
పేద యగుఁ గాక, రణమున వీరమరణ
మందు యోధుఁడు సామాన్యుఁ డగునె తలఁప?

ఆగు మాగుము ఆర్యుఁడా! ఆత్ర మేల?
అక్కటా ! యిట్టి వీరుండు దిక్కు లేని
యనద కైవడి కాటికి నరుగ నేల !
అన్న ! నీవెంట రానిమ్ము నన్ను గూడ."

36