పుట:మధుర గీతికలు.pdf/342

ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య యోధుఁడు


ఒక దినంబున సాయంత్ర మోరుగల్లు
నగరవీథుల నొకవ్యక్తి నడచుచుండె;
అతని దుస్తులు సామాన్యమైన వగుట
ఆతఁ డెవ్వరొ యెఱుఁగ లేరైరి జనులు.

దారుణంబును కడు విషాదంబు నైన
దృశ్య మొక్కటి యాతని దృష్టిఁ బడియె.
శకటశకలంబుపై నొక్క శవము బెట్టి
లావుమై నొక్క మనుజుండు లాగుచుండె.

బండిపై కప్పు, శవముపై బట్ట లేదు,
అతని వెనువెంట నొకఁడు సాయంబు లేఁడు,
బరువుచే క్రుంగి యాయాసపడుచు నతఁడు
లాగఁజాలక సారెకు నాగుచుండె.

35