పుట:మధుర గీతికలు.pdf/341

ఈ పుట ఆమోదించబడ్డది


ముఱికివాఱిన యా మేలిముసుఁగునందు
కాంతనెమ్మోము చెలువమ్ము కానిపించె,
చిఱుతమబ్బులమాటునఁ దుఱఁ గలించు
నిండునెలవోలె కన్నులపండు వగుచు.

‘వాలుఁగున్నుల జగ మెల్ల నేలఁ జాలు
తరుణిమిన్నకు నే మిచ్చి తనుపువాఁడ ?
బాళి మీఱఁగ నన్నె యప్పనము చేసి
ధన్యుఁడు నగుదుఁ గా' కని తలఁచె రాజు.