పుట:మధుర గీతికలు.pdf/340

ఈ పుట ఆమోదించబడ్డది

బి చ్చ క త్తె


జీర్ణమై కడు పూసిన చీరగట్టి
విరియఁబాఱిన నిడువాలుకురులు వ్రేల
కేలుదోయి సురమ్మునఁ గీలుకొలిపి,
వచ్చె భూవరుకడ కొక్క బిచ్చకత్తె.

అతిన నల్లంతదవ్వున నట్టె చూచి
వెఱఁగుపాటును నివ్వెఱ పెనఁగొనంగ
దిగ్గు రని లేచి గద్దియ డిగ్గి ఱేడు
ఎదురుగా నేగి స్వాగతం బిచ్చే నెలమి.

కటికిచీఁకటిమొత్తమ్ము కడకుఁ దోలు
కలికిమైజిగి మిఱుమిట్లు కొలుపఁ, జూచి
'అద్దిరా! యామెసోయగ ! మౌర! హొయసు !'
అనుచు తలలూచి మెచ్చిరి యచటి ప్రజలు

33