పుట:మధుర గీతికలు.pdf/338

ఈ పుట ఆమోదించబడ్డది



అనుదినంబును మధ్యాహ్న మచట నేను
కూరుచుండి రుమాళ్లను కుట్టుచుందు;
జననితోఁ గూడి పలుమఱు సంజవేళ
ప్రార్థనాగీతముల నట పాడుచుందు.

రమ్య మగు పండు వెన్నెల రాత్రులందు
చలువఱాతిన్నె పైఁ జేరి, చల్లగాలి
వీచుచుండఁగ, భక్ష్యముల్ వేడ్క మీఱ
నారగింతుము నేను మా యమ్మ యచట.

'నిర్మల' గతించి నెల యైన నిండలేదు,
చనియె 'విమలుండు' మొన్ననే స్వర్గమునకు;
తోటలో నవె యా సమాధులును రెండు
వరుస నున్నవి యొకదానిప్రక్క నొకటి.'

'బాలరో : వార లిరువురు స్వర్గమందు
నున్నచో, నింక మీ రెంద రున్నవారు?
అనుచు నడిగితి, తోడనే యామే నుడివే,
'ఇంత యేటికి - మే మందఱేడుగురము.'

31