పుట:మధుర గీతికలు.pdf/337

ఈ పుట ఆమోదించబడ్డది



"అన్న లిరువురు పొరుగూర నున్నవారు,
ఇరువురక్కలు పతులిండ్ల కేగినారు;
ఇంటిలో నుంటి నే" నని యంటి వమ్మ.
ఏడ్గురెట్లైరి ? నీ మాట లెట్లు పొసఁగు ?"

తడవుకొనకుండ నా బాల నుడివె నిట్లు,
'ఏడ్గురము మేము, చెప్పితి నింతమున్నె -
అందు నిరువురు గలరు సమాధులందు
తోటయందలి మామిడితోపునడుమ."

'ఈవు చెప్పిన మాటలే యియ్యకొందు,
ఏడుగురు మీర లందఱు, ఇరువు రందు
ఉసురు వాసి సమాధుల నున్నవారు..
ఐదుగురు కాదె మిగిలియనట్టివారు?'

'ఇట్టి మాటల నాడంగ నేటి కయ్య ?.
ఉసురు వాసియు నెదుటనే యున్న వారు
అల్లదే ! యా సమాధులయందుఁ జొచ్చి,
వారిపై మట్టి యిఁక తడియారలేదు.

30