పుట:మధుర గీతికలు.pdf/336

ఈ పుట ఆమోదించబడ్డది



'అమ్మ! నీ నామ మెవ ? రని యడిగియుంటి,
'సరళ' యని యామె బదులిడె'; 'సదన మెచట
నుస్న ?' దని యంటి, 'నెదుటనే యున్న' దనియె
పలుకుపలుకున తేనియ లొలుకుచుండ.

'చిన్ని బాలరొ! నీకెంద రన్నదమ్ము
'లక్కచెల్లెండ్రు గల ?' రని యడిగియుంటి,
“ఎందరో యేల- నాతోడ నేడ్గు' రంచు
పలికె నను జూచి యబ్బురపాటు నొంది.

‘చిన్నికన్నెరొ! వారెందు నున్నవారు ?'
'ఇట్టు లనె నామె, “మే మంద రేడుగురము,
అన్న లిరువురు పొరుగూర నున్న వారు,
ఇరువురక్కలు పతులిండ్ల కేగినారు.

మఱియు నిరువురు కలరు సమాధులందు
అక్క యొక్కతె, సోదరుఁ డొక్కరుఁడును ;
వారిచెంతనే యీ పుష్పవనమునందు
ఇంటిలో నేను తల్లితో నుంటి నయ్య.'

29