పుట:మధుర గీతికలు.pdf/335

ఈ పుట ఆమోదించబడ్డది

ఏ డు గు ర ము



ఏమి యెఱుఁగని యొక యమాయికపు బిడ్డ
కన్ను లైనను తెఱువని చిన్నికూన
చెక్కు గీఱిన పాల్గాఱు చిఱుతపాప
ఎఱుఁగునే యది యెట్టిదో మరణ మన్న!

కంటి నొకబాల మార్గంబు వెంటఁ జనుచు ;
ఆమె యాఱేండ్ల లేతపాయంపు పూప,
పల్లెలో పుట్టి పెరిగిన పిల్ల యగుట
అన్నెమును పున్నె మెఱుఁగని యట్టి బేల

నిగనిగలు దేఱి ముంగురుల్ నెఱులు దిరిగి
ఆమె మొగమున దోబూచు లాడుచుండె,
తేటకన్నులు ముద్దులు మూట గట్టె
ఆమె యందము నన్ను మోదాబ్ధి దేల్చె.

28