పుట:మధుర గీతికలు.pdf/334

ఈ పుట ఆమోదించబడ్డది



“నీదు కుల మేది : ఎవ్వఁడు నీదు తండ్రి ?
నుడువుమా వత్స! యని బాలు నడిగే మౌని;
జాలి గులుకంగ వినిపించె బాలుఁ డంత
తల్లి తనతోడ చెప్పిన దెల్ల మునికి

"సిగ్గు నెగ్గును విడిచి యీ చెడిపెకొడుకు
ఎట్టి సాహసమున కొడిగట్టె నౌర :"
అనుచు వడుగులు గుసగుసలాడికొనుచు
చుఱుకుచూపుల నతనిపైఁ బఱపి రంత.

కనుల 'నానందబాష్పముల్ తొనకియాడ
దిగ్గు రని లేచి బాలుని బిగ్గఁ బొదివి
కౌఁగిట గదించి మౌని గద్గదిక గదుర
ఇట్టు వచియించె మక్కువ యుట్టిపడఁగ.

“తల్లిగుట్టైన నించుక దాఁచకుండ
సత్యము వచించితివి గాన 'సత్యకాము'
డనెడు నీ పేరు సార్థక మయ్యె వత్స!
నిక్క మగు బ్రాహ్మణుండవు నీవ కావె ? "

27