పుట:మధుర గీతికలు.pdf/332

ఈ పుట ఆమోదించబడ్డది



బాలుఁ డీరీతి నొయ్యన బదులు పలికి
మునిని వీడ్కొని, మింటిపై మినుకు మనుచు
మెరయు చుక్కల గుంపులే తెఱువు సూప
ఏటిదరి నేగి తన తల్లియిల్లు జేరె

తనయు రాక నిరీక్షించి తమక మొప్ప
తలుపుచెంగట నిలుచున్న తల్లి యతని
గాంచినంతనె బాళిమై కౌఁగిలించి
శిరము మూర్కొని యిట్లనే పెరిమ గులుక.

“కాంచితివె యోగిసత్తము గాంక్ష దీఱ ?
ఆదరించెనె దయతోడ నతఁడు నిన్ను ?
యతివరేణ్యుఁడు నీ కేమి యానతిచ్చె ?
చెప్పుమా యేమి జరగెనొ చిట్టిపట్టి ?"

"కాంక్ష కడలొత్త మునివర్యుఁ గాంచినాడ,
అధికదయతోడనన్నతఁ డాదరించె,
బ్రాహ్మణుఁడు తక్క యన్యుడు బ్రహ్మతత్వ
మరయరా దని మౌనీంద్రుఁ డానతిచ్చె.

25