పుట:మధుర గీతికలు.pdf/330

ఈ పుట ఆమోదించబడ్డది

స త్య కా ముఁ డు



క్రుంకెతపనుండు, పక్షులు గూండ్లు సేరె,
ఆలకదుపులఁ జయ్యన తోలికొనుచు
ఆశ్రమమునకు మునిబాలు రరుగుదెంచి
చేరియుండిరి బారులై చెట్టునీడ.

అది మహాముని గౌతము నాశ్రమంబు;
శిష్యు లెల్లరు తనచుట్టు చేరి కొలువ,
వీతిహోత్రముపొంత నా గౌతముండు
అలరు చుండెను రెండవయగ్నివోలె

అంత నొక వింతబాలకు, డరుగుదెంచి
ఫలము పుష్పము లర్పించి, భక్తిమీఱ
మౌనిపదముల పైఁ దనమౌళి సోఁక
మ్రొక్కి యీరీతి వచియించె ముద్దులొలుక.

23