పుట:మధుర గీతికలు.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

22

ఎన్నో యువక సాహిత్య సంస్థలు రాజమందిరమున వెలసి అత్యుత్సాహముతో ఆంధ్రసాహిత్యాభివృద్ధికి దోహదకరమగు కార్యక్రమములు నిర్వహించుచుండెడివి. అట్లే శ్రీకృష్ణరావుగారి ప్రోత్సాహముతో ఎన్నో సాహిత్యసంస్థలు, చిన్న చిన్న గ్రంథాలయములును స్థాపింపబడి, ఓపినంత సాహిత్య సేవ సల్పుచుండెడిని. అట్టి సంస్థలలో శ్రీరామబాలభక్త సమాజము, కౌముదీ పరిషత్తు, జాలీఫ్రెండ్స్ అసోసియేషనులను పేర్కొనవచ్చును. ముఖ్యముగా యౌవన ప్రాదుర్భావమునందే తానొక కృష్ణదేవరాయల యాకృతి వహించి. శ్రీ చాగంటి వీరభద్రకవి పెద్దనగా, సత్యవోలు అప్పారావు, సుంకర రంగయసూరి, సూరాబత్తుల సూర్యనారాయణ సుధి, అత్తిలి సూర్యనారాయణ మనీషి, చెళ్లపిళ్ల చినవేంకటశాస్త్రి, నిడమర్తి భీమరాజు, టేకుమళ్ల వసురాట్కవులు మిగతా కవుల పాత్రలు కాగా, వీరందఱును అష్టదిగ్గజములుగా కృష్ణరావుగారు అభినవ కృష్ణరాయడుగా ఎల్లప్రొద్దులు సాహిత్య సమావేశములు, కవిపండిత చర్చలు, కావ్యపఠన కార్యక్రమములు, సమస్యాపూరణాద్యనేక సాహిత్య సల్లాపగోష్ఠులు నిర్వహించెడు వారు.

శ్రీపంతులుగారి కుడిభుజమై నిర్వహించిన సంఘసంస్కారోద్యమ విశేషములెన్నోచరిత్ర కెక్కవలసినవి యున్నవి - కాని శ్రీపంతులుగారి చివరి దినములలో గురుశిష్యులకు పొడమిన భేదభావముల వలన నవియన్నియు తెరమరుగైపోయినవి. శ్రీపంతులుగారు తమ స్వీయచరిత్రయందుతన శిష్యాగ్రగణ్యుడై న నాళము కృష్ణరావు తన ఉద్యమమునకు, దేశమునకును కావించిన