పుట:మధుర గీతికలు.pdf/329

ఈ పుట ఆమోదించబడ్డది



పుష్పితాశోకవృక్షంబు పొలుపు గులుక
చిఱుతఁ డొకచేత సేనలఁ జేయి వీచి,
ఎత్తి యొకచేత శంఖంబు నొత్తి యూఁదె
ప్రాణవాయువు కంఠంబు బాయుదనుక.

**** **** **** ****



ఉభయదళములు తలఁవడె నొక్క పెట్ట,
తెల్లవాఱెను, రిపుమోము వెల్లఁబాఱె;
గెలుపు గలిగియు ఱేనికిఁ గలుగ దయ్యె
నిండుమోదము బాలవీరుండు లేమి.

22