పుట:మధుర గీతికలు.pdf/327

ఈ పుట ఆమోదించబడ్డది



అదిగో ! అది యేమి ? ఎవ్వఁడో పొదలనుండి
దొంగ కాఁబోలు- మెల్లఁగా తొంగి చూచి
చెంగు మని యొక్క గంతున చెంగలించి
పెఱికె ఖడ్గంబు బాలుని కరమునుండి,

ఒక్కరుఁడు కాదు- పదుగురు పెక్కు రగుచు
పుడమి యీనినచందాన పొదలనుండి
ఒక్కరొకరుగ నాతనిచక్కి కుఱికి
చుట్టుముట్టిరి యీఁగలతుట్టెలట్టు.

బాలుఁడా నీదు కోర్కెలు భగ్నమయ్యె,
నిన్ను జయలక్ష్మి వరియింప నున్నతఱిని
చిక్కువడితివి పగతురచేతఁ దక్కి
చీమగమిచేతఁ జిక్కిన చిలువవోలె.

'మిన్నకుంటివ సరె, నోరు మెదపితేని
నిశితకరవాలధారల నీ శిరంబు
చెండు మీటినగతి చించి చెండువార
‘మనుచు బాలుని గద్దించి రరులు గదిసి.

20