పుట:మధుర గీతికలు.pdf/325

ఈ పుట ఆమోదించబడ్డది



అధిపునానతి తలఁ దాల్చి యాతఁ డపుడు
అరులజాడల నరయంగ నరుగుచుండె,
ఎక్కడే చీమ యింత చిటుక్కు మన్న
వేయికన్నుల గని పెట్టి వెదకుచుండె.

'మూఁడుజాములు రాతిరి ముగిసే నిపుడు
ఎట్టి యలికిడి వినఁబడ దింతదనుక ;
జరిగెనా రాత్రి, సిద్ధంబు జయ' మటంచు
మోద మందుచు నాతఁడు మురియుచుండె.

ముగిసే రాతిరి, కానయు ముగియవచ్చె,
కూఁతవేటునఁ గన్పట్టె కోటబురుజు,
మింట నరుణంపుచాయలు మిసిమిపెట్టె,
కూసె తొలికోడి కొక్కొరోకో యటంచు.

మించి దినరాజు రేరాజుమీఁది కెత్తి
పగతుజాడల నరయంగఁ బంప, వేఁగ
వేఁగుజామున దూతయై వేఁగు నెఱప
నేఁగుదెంచెనొ యనం దోఁచె వేఁగుచుక్క.

14