పుట:మధుర గీతికలు.pdf/324

ఈ పుట ఆమోదించబడ్డది

బా ల వీ రుఁ డు



చిట్టిచీమయు చొరరాని దట్టమైన
నట్టడవి, నొక్కదినమున, నడికి రేయి,
నొంటిమై యేగుచుండెను యోధుఁ డొకఁడు
పదియు నెనిమిదియేఁడుల పడుచు వాఁడు.

భీకరం బగు నా ఘోరవిపినసీమ
నిండు వెన్నెలతీఁగలు నిగుడ వయ్యె
చుక్క గుంపుల మిసమిసల్ చొరఁగరావు
పొటకరించిన కటికిచీఁకటులె కాని.

చిమ్మచీఁకటియే తన చెలిమికాఁడు,
తోర మగు ధైర్యసంపద తోడునీడ,
స్వామిభక్తియె రమ్యభూషణము గాఁగ
ఎటకో చనుచుండె యోధుఁడా కటికిరేయి

17