పుట:మధుర గీతికలు.pdf/322

ఈ పుట ఆమోదించబడ్డది



పాదముల సోఁకి యూరులపైకిఁ బ్రాకి ,
కౌనునఁ బెనంగిఁ, కంఠంబు కౌఁగిలించి,
చిట్టిచుబుకంబు చుంబించె; ఎట్టితీపొ
వీతిహోత్రుని కా ముద్దు బిడ్డ మీఁద ?

జ్వలన మొందెడు వహ్ని కాజ్వాలలపయి
అతని జీరాడు కురులు నాట్యంబు సలిపె,
విరియఁబూచిన మందార తరువుమీఁద
బాళిమై మూఁగు తుమ్మెదపాళి యనఁగ

మరల గొంతెత్తి కడసారి యఱచె నతఁడు
‘నిలుతునే యింక ? నీయాజ్ఞ తెలుపు మయ్య'
జాలి గుల్కెడి యా పల్కు లాలకించి
కొందలము జెంది జలనిధి ఘోషవెట్టె.

అంతకంతకు పెనుమంట లగ్గలించి
గుప్పుగుప్పున కుప్పించి యుప్పరమున
కెగసి, యట్టిట్టు గాలిలో నెగురుచున్న
ధ్వజముమీఁదికి దండెత్తి దాడి సలిపె.

15