పుట:మధుర గీతికలు.pdf/321

ఈ పుట ఆమోదించబడ్డది



‘చెప్పుమా తండ్రి? నే నింక నిప్పు డైన
అవలి కేగుదునే' యంచు నఱచె నతఁడు,
ఎఱుఁగఁ డక్కట! తన తండ్రి యింతమున్నె
అగ్నిహోత్రుని కాహుతి యయ్యె నంచు.

భీకర కరాళ సర్పజిహ్వికల ఛాతి
బుస్సు బుస్సని చిద్చులు బుగులుకొనియె;
విలయకాలము శాసించు విభునిఁ బోలె
నిర్భయంబుగ నిలుచుండె నర్భకుండు.

వేడ్కమై మృత్యుదేవిని పెండ్లియాడ
తమక మొందెడు పెండిలికొమరుఁ డనఁగ,
ఠీవి మీఱగ నిలుచుండె డింభకుండు
వీర శృంగారరసములు పెనఁగులాడ.

'ఏల పలుకవు ? నా పని యిప్పుడైన
అయ్యెనే ?' యని క్రమ్మఱ నఱచె నతఁడు;
వాని పలుకులు చిటపెటార్భటులనడుమ
నడగిఁ యవలికి వెలివడ వయ్యె నకట 1

14