పుట:మధుర గీతికలు.pdf/320

ఈ పుట ఆమోదించబడ్డది

కే స బి యాం క



గుప్పు మని మండు నోడపైకప్పుమీఁద
నిట్టనిలుచుండె బాలుండు నిబ్బరముగ,
తనదు జనకుని యానతి తలను దాల్చి ;
పఱచి రెల్లరు నాతఁ డొక్కరుఁడు దక్క

సంజకెంజాయనడుమ భాస్కరుఁడు వోలె,
దట్టముగ మండు మంటల నట్టనడుమ,
విమలకాంతుల బాలుండు వెలుఁగుచుండె,,
వీరరస మౌర! మూర్తీభవించె ననఁగ

ఉజ్వలంబుగ జ్వాలలు ప్రజ్వరిల్లె
కాని, యా బాలుఁ డొక్కింత కదలఁడయ్యె
తండ్రియానతి. భక్తిమై తలను దాల్చి;
బళిర ఎంతటి ధీరుండొ బాలకుండు?

13