పుట:మధుర గీతికలు.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

21

వచ్చుటయే తటస్థించినచో కృష్ణరావుగారిని దర్శింపక వెళ్లెడువారు కాదు. శ్రీ ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు రాజమహేంద్రవరమునందున్నన్ని నాళ్ళు గౌతమీ గ్రంథాలయమునందు శ్రీకృష్ణరావుగారితో కాలక్షేపము చేయకుండా ఉండెడివారు కాదు. శ్రీ బొడ్డు బాపిరాజుగారు, శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు మున్నగు మహానుభావులు కృష్ణరావుగారి సందర్శనార్దము ఏతెంచుచుండెడివారు.

శ్రీ ఈమని అచ్యుతరామశాస్త్రిగారిని పిలిపించి, ఇంటి యందే వారి కన్ని వసతులు కల్పించి, కుమారుడైన నాగేశ్వరరావునకు, కుమా ర్తెయైన లక్ష్మికాన్తమ్మకు , భార్య సుశీలమ్మకు వీణావాదనమందు శిక్షనిప్పించిరి. అట్లే నరసంపేట నుండి మహా వీణావిద్వాంసులైన, శ్రీ పొడుగు రామమూర్తి పంతులుగారిని తోడ్కొని వచ్చి నాళము వారి సత్రమునందు వారికి వసతి నేర్పాటు చేసి పిల్లలకు భార్యకు వీణావాదనమందు శిక్షనిప్పించిరి.

శ్రీ దేవత శ్రీరామమూర్తిగారును వీరును కలిసి, ఒక గానసభను స్థాపించి ఎన్నో గాన సభలను నిర్వహించియుండిరి. వ్యావహారిక భాషోద్యమ పితామహులైన శ్రీ పొడుగు శ్రీరామమూర్తి పంతులుగారి సప్తతి జన్మదినోత్సవమును అతి సమర్థముగా నిర్వహించిరి.

అఖిలాంధ్రదేశమునకు మకుటాయమానమై వెలుగొందిన గౌతమీ గ్రంథాలయమునందు జరిగెడు సభా సమావేశములకు లెక్క యుండెడిది కాదు. గౌతమీ గ్రంథాలయ మాశ్రయముగా