పుట:మధుర గీతికలు.pdf/319

ఈ పుట ఆమోదించబడ్డది



చలువవెన్నెలగుత్తితో, సంజతోడ
హాయి మీఱఁగ నీ వాట లాడుచుండ,
వెండి బంగరురూకల పిండు బేర్చి.
తనివి నొందని యాసలఁ దవిలియుందు.

అందరాని ఫలంబుల కఱ్ఱు సాచి
పొందనేరని పదవులఁ బొందఁ గోరి
చేయరానట్టి పనులెన్నో చేసి చేసి
గడుపుచుందును రిత్తఁగా కాల మెల్ల.

ఆస లనియెడు సాగరమందు నీది
మునిఁగి తేలుచు, తేలుచు మునిఁగి నేను
జడుఁడనై జీవయాత్రను గడపుచుండ,
నవ్వుచుంటివి కాఁబోలు నన్నుఁ జూచి,

12