పుట:మధుర గీతికలు.pdf/318

ఈ పుట ఆమోదించబడ్డది

ఏల నవ్వుచునుంటివి ?


లీల నొకకేల విఱిగిన కోలఁ బట్టి
హొయలు మీఱఁగ పచ్చిక బయలుమీఁద
ఓహో! ఎంత హాయిగ నాడుచుంటి వోయి
ముచ్చటగుఁ గాదె నిను జూడ ముద్దుబిడ్డ !

సంతసంబున త్రుళ్లుచు, గంతు లిడుచు,
పరుగు లెత్తుచు, పాడుచు, కెరలి కెరలి
ఏల నవ్వుచునుంటివో బాలపాప ?
కనులపండువ యగుఁ గాదె నిను గనంగ.

చేతి కందిన వస్తువుల్ ప్రీతిఁ గొనుచు
వేడుకలు మీఱ నీ వాట లాడుచుండ,
అందఁజాలని వస్తువు లాసఁ జేసి
వెచ్చనూర్చుచు నే ప్రొద్దు పుచ్చుచుందు.

11