పుట:మధుర గీతికలు.pdf/317

ఈ పుట ఆమోదించబడ్డది



గల్లు గల్లున చిఱుగజ్జె లల్లలాడ
అల్లనల్లన మెల్లఁగ నడుగు లిడుచు
చింకిచొక్కాయితో నీవు చిందులాడ,
కొట్టిరే నిన్ను నెవ రైన చిట్టిబిడ్డ ?

విన్ను వీధిని జాబిల్లి వెడలు వేళ
చివికి శిథిలమై యెడనెడ చెదరియున్న
సన్న తొలకరిమబ్బులు తన్ను గప్ప
కొఱఁతవడియెనె యాతని కొమరుఁదనము ?

10