పుట:మధుర గీతికలు.pdf/316

ఈ పుట ఆమోదించబడ్డది

ఏల యేడ్చుచునుంటివి ?



చిన్ని కన్గవ ముత్తెంపుచిప్పలందు
జాఱి కన్నీటిముత్తెముల్ జాలువాఱ,
ఏల యేడ్చుచునుంటి వో బాలపాప ?
చెనకి నిను గొట్ట నెవనికి చేతులాడె?

చిట్టిచేతుల సారె కట్టిట్టు త్రిప్పి
నేలపై నీవు పొరలాడ, ధూళి యంటి
మురువు గులికెడు నీ మోము మురికివాఱె
ననుచు కొట్టిరె యెవ రైన ననుఁగుబిడ్డ?

చలువవెన్నెల లెల్లెడ చిలుకరించి
ఎల్లజీవులఁ గడు నుల్లసిల్లఁజేయు
చందురునియందు నొక్కింత కందు గలుగ,
తక్కు వయ్యెనె యాతని చక్కఁదనము ?

9