పుట:మధుర గీతికలు.pdf/315

ఈ పుట ఆమోదించబడ్డది



ఆ యనంత తేజోరాశి నవతరించి
విశ్వజీవన వాహినీవీచిఁ దేలి
నాదు మానస సింహాసనమున నేఁడు
కట్టికొంటివి పట్టంబు పుట్టతుదకు

భువనమోహన మైన నీ మూర్తి నేను
కనులపండువుగాఁ బొడగాంచునపుడు,
నిలువునను నాదు మే నెల్ల పులకరింప
అట్టె మ్రాన్పడి నిలుతు నీ యెట్టయెదుట.

ముద్దు లొలికెడు నీదు నెమ్మోముదమ్మి
కాంక్ష దీఱ నెగాదిగఁ గాంచునెడల
దృష్టితాఁకెడినో యంచు దిగులు చెంది
తేఱిపాఱఁగఁ దిలకింప నేర నెపుడు.

ఎన్న డైనను నను నీవు కన్ను మొఱఁగి
జుణిఁగిపోదువొ గికురించి యనెడు భీతి
మంజులగు నాబాహుపంజరుమున
పట్టి బంధించియుంతు నో చిట్టిపట్టి

8