పుట:మధుర గీతికలు.pdf/314

ఈ పుట ఆమోదించబడ్డది



చిన్నతనమున కూర్మినెచ్చెలులఁ గూడి
మంటిముద్దల చిన్నిబొమ్మలను జేసి
వేడుకలు మీఱ నే నాట లాడునపుడు
బొమ్మలను దాఁగి యుంటివి ముద్దుబిడ్డ!

అనుపమం బగు భక్తి నే ననుదినంబు
ఎలమి గృహదేవతల పూజ సలుపువేళ,
దేవతలలోన నీవు మూ ర్తీభవించి
నిలిచియుంటివి నాదు మందిరమునందు

యౌవనం బను తొలకరి యంకురించి
మవ్వ మగు నా మనం బసు పువ్వుగుత్తి
విరిసి యల్లన ఱేకులు విచ్చునపుడు,
ఆంటియుంటివి తావివై యందు బిడ్డ!

నాదు జీవితమునయందు, నీదు కూర్మి
తండ్రిజీవితమున, వాని తల్లిదండ్రి
జీవితంబుల వేయేల - సృష్టి మొదలు
నిలిచియుంటివి యీ యింట నేఁటిదనుక.

7