పుట:మధుర గీతికలు.pdf/313

ఈ పుట ఆమోదించబడ్డది

ఎట్లువచ్చితి?



"ఎట్లు వచ్చితి ? నన్ను నీ వెచటినుండి
తెచ్చికొంటివి ? అమ్మరో ! తెలుపు" మనుచు
పలుకుపలుకున తేనియ లొలుకుచుండ
అడిగే నొకనాఁడు తనతల్లి ననుఁగుబిడ్డ.

కనుల నానందబాష్పముల్ తొనఁకియాడ
చిన్నిబాలుని నక్కునఁ జేర్చి తల్లి
మోవి మోవిని గదియించి ముద్దుగొనుచు
ఇట్టు వచియించె మక్కువ యుట్టిపడఁగ.

“నాదు వలపుల మొలకవై, నా తలంపు
పంటవై, నా తపంబుల ఫలమ వగుచు
దాఁగియుంటివి నాదు డెందంబునందు
ఇన్నినాళ్లును నా ముద్దు చిన్ని కూన!

9