పుట:మధుర గీతికలు.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది

20

అట్లే బ్రహ్మ సమాజ నాయకుడైన శ్రీ హేమచంద్ర సర్కారు ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినపుడు శ్రీకృష్ణరావుగారి యింట విడిది చేయడం గమనార్హం !

శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారి వంటి మహా మహులు రాజమండ్రి వస్తే శ్రీకృష్ణరావుగారి దగ్గఱకు వచ్చి, వీరి సహాయ సత్కారాలు అందుకోకుండా వెళ్లేవారుకారు.

శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు పర్లాభిమిడి వదలి రాజమహేంద్రవరమునందు కొన్నాళ్లున్న సమయంలో శ్రీకృష్ణరావుగారి యింటికి వారు రావడం, శ్రీకృష్ణరావుగారు వారి యింటికి వెళ్లి తఱచు వారి యోగక్షేమాలు విచారించి, వారితో కలిసి సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందంటే. అత్యుక్తి కాదు

ఇట్టివి వారి జీవితంలో అనేక సంఘటనలున్నాయి.

శ్రీయుతులు దేశరాజు పెదబాపయ్య, కామరాజు హనుమంతరావు. తారకం, తల్లాప్రగడ ప్రకాశరాయడు, సర్ రఘుపతి వెంకటరత్నంనాయుడు, పిఠాపురం రాజాసూర్యరాయ మహీపతి, సర్ కట్టమంచి రామలింగారెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వెల్లంకి కృష్ణమూర్తి, చుండూరి శ్రీరాములు, కనపర్తి వరలక్ష్మమ్మ, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీపాద కామేశ్వరరావు గార్లు, స్థానికులైన వారేకాక,ఆంధ్రదేశము నలుచెఱగుల నుండి ఏ రంగమునకు చెందిన కళాభిజ్ఞులైనను రాజమహేంద్రవరమునకు