పుట:మధుర గీతికలు.pdf/309

ఈ పుట ఆమోదించబడ్డది



వన్నె చిన్నెలు గల పువ్వ లెన్ని యున్న
నిన్నె ప్రేమింతు మనసార చిన్ని పువ్వ :
నీ నిరాడంబర వివిక్త నిష్కళంక
జీవనంబును నలవడఁ జేసికొనఁగ.

ఒరుల మెప్పుల నాసింప నొల్ల వెపుడు,.
తళుకుబెళుకుల వాంఛింపఁ దలఁప వీపు ;
పావనంబగు తావక జీవనంబు
గడియ యైనను ధన్యంబు గాదె పువ్వ !

2