పుట:మధుర గీతికలు.pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

చిన్ని పువ్వు



ఏల పూచితివో చిన్ని నీలిపువ్వ :
ప్రజలు నడయాడు పచ్చికబయలి నడుమ ?
మనుజు లెవ రైస నాదారి మసలి రేని
వారి యడుగులఁ బడి నల్గి వాడిపోవె ?

శిరము నేటికి వంచెదే చిన్నిపువ్వ!
పరుల దృష్టిపథంబునఁ బడకయుండ
ఇంచు కొకసారి నెమ్మోము నెత్తి తేని
జనులు తమ కన్నుఁగవ నద్దుకొనరె నిన్ను ?

నీకు పేరేమి లేకున్న నీలిపువ్వ
సౌకుమార్యమునందును, సౌరభమున,
సోయగంబున నీ సాటి సుమములందు
కొంచె మేనియుఁ గలిగెనే కొఱఁత నీకు ?

1