పుట:మధుర గీతికలు.pdf/305

ఈ పుట ఆమోదించబడ్డది

బిచ్చకత్తె



కాఁపురము చెట్టునీడ, మగండు రోగి,
పాలు చేపమిఁ బోరిడు పాప చంక,
కూటికై యెడపిల్లలగొల్లు వెంట,
నెత్తిపై, ప్రొద్దు నడువీథి, ఉత్తజోలె,
పస్తు, వేఁకటి, సాగదు బాట - దవ్వు,
వాడవాడల కసరులు, వేడియూర్పు,
బుజ్జగింపుల బుడుతలబొజ్జ నింతు,
వాకులత జూప వింత చిరాకుపడవు,
ఈసడింపవు, విసువవు, వేసటఁగొన
నకట : మనుగడ లేబర మైనఁ గాని;
పేదఱిక మెంత యోర్పు నేర్పినదె తల్లి :

48