పుట:మధుర గీతికలు.pdf/304

ఈ పుట ఆమోదించబడ్డది

పచ్చిబాలెంత



తలఁగ విరు లింగ, గారియు చలి విఱుఁగదు,
బాట చిత్తడి, పొల మొక్క పరువునేల,
పురిటివరుసను మార్నీళ్లు వోసికొనవు,
విడవు తలకొంగు, పత్తెపుపిడుచ దినవు,
గనిమపై ఈతపొదనీడ, జినుఁగుబొంత
పఱచి పాలిచ్చి నిసుఁగును పండఁబెట్టి
పదము పాడుచు జోకొట్టి నిదురవుచ్చి,
బురదమళ్లను వరియూడుపులకు దిగుదు;
వెంత మొఱకవె పచ్చివాలెంత వయ్యు !
కూలిగింజల కింత కక్కురితి యేల
పేదరికమెంత తెగువ నేర్పెనొ గదమ్మ!.

47