పుట:మధుర గీతికలు.pdf/295

ఈ పుట ఆమోదించబడ్డది


“మూఢుఁ డగు వీఁడు దేవుండు లేఁ డటంచు
పదరినంతనె లేకపోవుదునె నేను ?
ఇంతమాత్రన నీయట్టి శాంతిపరులు
అలుక బూన వివేకమే యతివరేణ్య ?

“ఆస్తికుం డయి నిర్దయుఁ డైనవాని
కంటె, నాస్తికుండై దయ గల్గియున్న
వాని నెక్కుడు ప్రేమింతుఁ గాన, నీవు
భూతదయ గల్గి యుండుము బుద్ధి గలిగి."