పుట:మధుర గీతికలు.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది


వృద్ధుఁ డీరీతి ననె తాను బౌద్దుఁడగుట,
“ఈశ్వరుఁడె లేఁడు, నాకేల యింక సంధ్య ?
ఆఁకటను ప్రేగు నకనకలాడుచుండె
తడవు సేయక భోజన మిడఁగదయ్య.”

“నాస్తికుం డగు వాని కన్నంబు నిడుట
కంటె వేఱొండు పాపంబు కలదె ?" యనుచు
కినుకచే వాని నవలికి గెంటి వైచి
తాను నాపూట పస్తుండె తపసిఱేఁడు.

అతని కీశ్వరుఁ డంత ప్రత్యక్ష మగుచు,
వాని కిట్లనె “ఎట్టివాఁడైనఁ గాని
అతిథి యై వచ్చె నేనియు నన్న మిడక
తఱిమి వైచుట ధర్మమే తాపసేంద్ర !

“వీనితో నీవు గడె యైన వేఁగలేక
గెంటితివి అన్న మొసఁగక యింటినుండి;
వీనిచేష్టల సహియించి వేఁగుచుంటి
తొంబదేడులనుండి తుందుడుకు పడక.