పుట:మధుర గీతికలు.pdf/290

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుఁడు - వంటవాఁడు


బ్రాహ్మణుఁ డొకండు తనయింట వంటచేయ
వంటవానిని కుదిరించి, వాని కనియె;
“ముందు నీ తెల్వి యభివృద్ధి నొందుకొలఁది
వృద్ధి గావించుచుందు నీ వేతనంబు.”

పాఱుఁ డంతట తన క్రొత్త వంటవానిఁ
బిలిచి వానికి రెండుకాసుల నొసంగి
"ఓయి! ఒక కాని మజ్జిగ, యొక్క కాని
నూనె తె” మ్మని నియమించి వానిఁ బంపె.

చిత్త మని యాతఁ డొకగిన్నె చేతఁ బట్టి
కొందనుక నేగి, యేదియో సందియంబు
మదిని దట్ట, గిరుక్కున మరలి, వేగ
నింటి కేతెంచి, విప్రున కిట్టు లనియె.