పుట:మధుర గీతికలు.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది

18

1911 వ సంవత్సరమున మొదలు పెట్టి 'మానవసేవ' యను సచిత్ర మాసపత్రికను ప్రచురించిరి. ఇది అప్పటికి తొలి సచిత్ర మాసపత్రిక :


శ్రీకష్ణరావుగారు ఆనాటి సంఘమును మేల్కొల్పుటకు, ముఖ్యముగా పిన్న వయసు వారిని ప్రబోధించుటకు సాంఘిక, రాజకీయ, సాహిత్య చైతన్యము కల్గించు రచనలకే ప్రాధాన్య మిచ్చి అట్టి రచనలనే కావించితి. కృష్ణరావుగారు జీవించి యున్నంత వఱకు 'భారతి' (సచిత్రమాసపత్రిక) కృష్ణరావుగారి పద్యములనే మొదటి పుటలో ప్రచురించెడిది. అట్లే 'వాసవి' మాసపత్రిక కూడా:

శ్రీకృష్ణరావుగారికి ఆప్తమిత్రులైన ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు, హైదరాబాదు నందలి తిరుమలగిరి బజారువైశ్య సంఘ నాయకులైన శ్రీ అల్లాడి వీరయ్య గుప్త ప్రభృతులు శ్రీ కృష్ణరావుగారికి ఘన సమ్మానమొనరించినపుడు 'మధురకవి' బిరుదమిచ్చి గౌరవించిరి. అట్లే ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ కొప్పరపు సుబ్బయ్య శ్రేష్టిగారు సన్మానించి రజత మురళి నొసంగిరి. నరసన్న పేట వాస్తవ్యులు పొట్నూరు స్వామిబాబుగారు ఘన సన్మానమొనర్చిరి.

కృష్ణరావుగారి యిల్లు ఎప్పుడును కవి, పండిత, గాయక, నటబృందములతో నిండియుండెడిది. కవిసార్వభౌమ శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు చతురంగ క్రీడ సల్పుచు ఎక్కువ కాలము కృష్ణరావుగారి యింటియందేయుండెడివారు