పుట:మధుర గీతికలు.pdf/289

ఈ పుట ఆమోదించబడ్డది


తొలుత నీ వార్త లెల్లను తెలుపకుండ
ఏల దాఁచితి సేవకా ! యింతతడవు ?'
'ఘోర మగు నిట్టి వార్తల గుండె పగిలి
ప్రాణములు బాతు వనియెడు భయముచేత,
చల్లఁగా చెప్పవలయును చావుకబురు
అనుచు పెద్దలు చెప్పు వాక్యంబు తలఁచి,
ఒక్కసారిగఁ జెప్పక, యొకటి వెనుక
నొకటి వినిపించితిని నీకు నోర్మి మీఱ.'