పుట:మధుర గీతికలు.pdf/288

ఈ పుట ఆమోదించబడ్డది


'వ్యాధి యేమియు లేదు, దుర్వార మెన
పిడుగు బోలిన యవ్వా ర్త వినుటకతన.'
'ఏమిదుర్వార్త నాలించి యామె చచ్చె ?'
'అకట ? వచియింప నాకు నోరాడ దయ్య ?
దుర్భరం బగు మీతండ్రి దుర్మరణము
నాలకించినతోడనే యసువు బాసె.'
'ఏమి యంటివి ? సేవకా ! ఏమి యంటి
వమలచారిత్రుఁ డైన మాయయ్య యకట !
జీవముల నేల కోల్పోయె చెప్పు మయ్య.'
'దారుణం బగు నామాయదారివార్త
వినినయంతన గుండెలు వ్రీలి చచ్చె.'
'ఎట్టి దుర్వార్త విని తండ్రి గిట్టె చెప్పమ.'
'భయద మైనట్టి పెద్దతుపానుచేత
ఉదధిలోపల నున్న మీయోడ లెల్ల
మునిగె ననువార్త విని-'
                            'కటా ? వినఁగఁ జాల
ఎట్టికష్టంబు లొకపెట్టఁ జుట్టుకొనియె ?